2025 సంవత్సరానికి ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ రూ.15 లక్షల కోట్లు.. కానీ..!
- 158 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న కంపెనీ
- పనితీరు విషయంలో లక్ష్యాలను నెరవేరితేనే మస్క్‌కు మొత్తం అందుతుంది
- టెస్లా బోర్డు ఆమోదిస్తే మిగతా 26 బిలియన్ డాలర్లు చేతికి!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 158 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని పొందారు. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆయన ప్యాకేజీని కంపెనీ పేర్కొంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.15 లక్షల కోట్లు. ఎలాన్ మస్క్ నెలవారీ వేతనంగా ఎలాంటి మొత్తాన్ని పొందడం లేదు. స్టాక్ అవార్డులు, ఇతరత్రా రూపంలో పారితోషిక ప్యాకేజీని అందుకుంటారు. ఈ క్రమంలో గత సంవత్సరానికి గాను ఆయన ప్యాకేజీని టెస్లా ప్రకటించింది.
అయితే ప్రకటించిన మొత్తంతో పోలిస్తే ఆయన పొందే విలువలై చాలా వ్యత్యాసం ఉంటుందని కూడా టెస్లా తన ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ పనితీరు ఆధారిత పారితోషికం విలువ 132 బిలియన్ డాలర్లుగా ఉంది. పనితీరు విషయంలో కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరితేనే ఈ మొత్తం మస్క్‌కు అందుతుంది. అలాగే ప్యాకేజీలో మిగతా 26 బిలియన్ డాలర్లు కూడా టెస్లా బోర్డు ఆమోదిస్తేనే అందుతుంది.